Thursday, November 22, 2012

జీవితం ఇంకా అయిపోలేదు....

చాన్నాళ్ళకు ఎందుకో తెలుగులో రాయాలనిపించింది!!!

కానీ రాయడానికి ఏమి లేదంటేనే ఏదో వెలితిగా ఉంది. జీవితం లో ఏదో సాధించేద్దాం అని ప్రతివాడికి ఉండక పాయిన, ఏదోక సమయంలో సాధించడానికి ఏదోకటి అనుకుంటాడు. కానీ అది సాధించలేనప్పుడు నిరాశతో కృంగిపోయి ఎందుకు బ్రతుకుతున్నాన అనే ఆలోచనలోకి కూడా వెళ్తాడు. కానీ వాడు సాధించలేనిది జీవితాశయం  కాదు జీవితంలో ఒక చిన్న కోరికని అని మర్చిపోతాడు. ఈ జీవితం చాల చిన్నది. దానిని చిన్న చిన్న కారణాల కోసం చిన్నబోయి చిన్నదిగా చేస్కోవద్దు.


ఎవరికైనా జీవితంలో ఓడిపోయమనిపిస్తే, జీవితం ఇంకా అయిపోలేదని గుర్తుంచుకోండి. జీవితం అనేది ఎన్నో రంగుల మిళితం. ఎదో ఒక్క రంగు బాలేదని మిగతా రంగులని కాదనుకోవడం మూర్ఖత్వం.

2 comments:

  1. vow chandu, chala baga rasavu ra.
    telugu bhasha lo neeku inta praveenyam undani teliyadu. bhesh.

    ReplyDelete
  2. Good Chandu, Pedda vishayanni ardamayyetlu chinnaga baaga cheppav

    ReplyDelete