Friday, August 16, 2013

స్వతంత్రదినోత్సవం

స్వతంత్రదినోత్సవం...

మనకి ఝండా గుర్తుకు వచ్చే రోజు....

అదేమిటో, ఎప్పుడూ లేనిది ఈ రోజే మనకి గుర్తుకు వస్తుంది...  ప్రేమ పుట్టుకు వస్తుంది...
అదే ప్రేమ రోజు  మనం  చూపించగలిగితే మన  దేశం ఎప్పుడో అభివృద్ధి చెందిన దేశం అయ్యుండేది.

అయినా తప్పు ఒకరిది కాదులే ... చాలా మందిది.. ఇంకా చెప్పాలంటే మన అందరిది.

అయ్యో!!! ఇలా అయింది ఏంటి? ఇలా చేశాడేంటి?? ఛీ!! అని మనం  తిట్టుకుంటాం! అసహ్యించుకుంటాం!!
నిజానికి మనల్ని మనమే తిట్టుకోవాలి,  వాళ్ళ గురించి తెలుసుకోకుండా ఎన్నుకున్నందుకు...
అసహ్యించుకోవాలి, ఇన్ని జరిగినా, జరుగుతున్నా పట్టించుకోకుండా ఎవరి దారి వాళ్ళం చుస్కుంటునందుకు...

ఇవన్నీ చూస్తుంటే  స్వతంత్రం ఎందుకు వచ్చిందా అనిపిస్తుంటుంది.

నిన్నస్వతంత్రదినోత్సవం! నిన్న ఉన్న ప్రేమ ఝండా పైన ఈ రోజు కూడా చూపించేవాళ్ళు ఒక్కళైనా  వాళ్ళున్నారా? లేరు! ఉండరు కూడా! ఎందుకంటే మనకేమి వస్తుందని స్వార్ధం.
మనిషికి స్వార్ధం ఉండచ్చు!! కానీ  స్వార్థం మాత్రమే ఉండకూడదు!

ఆ స్వాతంత్రం... ఈ స్వార్థమ్... ఈ రెండు కలిసిన మనిషి అంతులేని అక్రమాలు చేస్తూ పోతున్నాడు... దానికి ఫలితంగా అధికారం కోసం ప్రాకులాడుతూ ఆక్రమించుకుంటూ పోతున్నాడు. చివరకు ఏది దొరక్కపోతే భూమిని ముక్కలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు... ఇదిలానే జరుగుతూ పోతే మన తరువాతి తరం మనంత అయ్యేసరికి వీదికొక మండలం, పేటకొక జిల్లా, ఊరికొక రాష్ట్రాన్ని చుసినా ఆశ్చెర్యంలేదు...

ఇలా జరగకుండా ఉండాలంటే మనం పెద్దగా ఏమి వెలగబెట్టక్కర్లేదు. నీ జీవితాన్ని త్యాగం చేయనక్కర్లేదు.
వోటు వేసేప్పుడు ఎందుకు వాడికి వేస్తున్నవో ఆలోచించుకొని, మంచిదే అతన్ని/ఆమెని ఎన్నుకోడం అనిపిస్తేనే వెయ్యి. తప్పు జరుగుతున్నప్పుడు నన్ను కాదుగా అనే ఆలోచన వదిలేయ్. నీ సొంత విషయంలాగ అనుకుని నిలదీ. ఎక్కడైనా, దేన్నైనా ప్రశ్నించు! నీకు ఆ హక్కుంది.

ఈ చిన్న చిన్నవి మనం చేయగలిగితే ఇంకా మనం దేని గురించి భయపదనక్కర్లేదు.